ఇది పాత పుస్తకంలో జావళి గానూ, కొత్త పుస్తకంలో పదం గానూ చెప్పబడినది. This was mentioned as a jAvaLi in the old book, and as a Padam in the new book.
Title | ముంజేతి కంకణ | munjEti kamkaNa |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | సావేరి | sAvEri |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ముంజేతి కంకణమ్మున కద్దమేలనే రంజిల్లు వాని గుణము రమణి మనమెరుగమే | munjEti kamkaNammuna kaddamElanE ramjillu vAni guNamu ramaNi manamerugamE |
చరణం charaNam 1 | కమ్మదనము మాటలనె కడుపులో నొక విధమె కొమ్మవాని వలపు నిక్కము గాదే నమ్మరాదె | kammadanamu mATalane kaDupulO noka vidhame kommavAni valapu nikkamu gAdE nammarAde |
చరణం charaNam 2 | మాటలను తేటలను మనవద్దనే చెలియ మాపటిపకలా మగువతోడ తగవదేడ | mATalanu tETalanu manavaddanE cheliya mApaTipakalA maguvatODa tagavadEDa |
చరణం charaNam 3 | భాసురాంగి నిన్ను మాయ జేసె నేనేమి సేతు దాసురామ కవి మనో నివాసుడాయే మోసమాయె | bhAsurAmgi ninnu mAya jEse nEnEmi sEtu dAsurAma kavi manO nivAsuDAyE mOsamAye |