Title | పాటబాడెద | pATabADeda |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | ఆది (1893) రూపక (1991) | Adi (1893) rUpaka (1991) |
పల్లవి pallavi | పాటబాడెద రార సామి పరమానందమురా నాసామి బ్రహ్మానందమురా | pATabADeda rAra sAmi paramAnandamurA nA sAmi brahmAnandamurA |
చరణం charaNam 1 | మదనజనక నీ దయ మదినిగోరి యున్నదాన ముదము మీర ముచ్చటాడి ముద్దుబెట్టరా నా సామి ముద్దుబెట్టరా నా సామి | madanajanaka nI daya madinigOri yunnadAna mudamu mIra muchchaTADi muddubeTTarA nA sAmi muddubeTTarA nA sAmi |
చరణం charaNam 2 | వలపు నిలుపలేనురా వగలుమాని యేలుకోరా కళలు దేర నొక్కసారి కౌగలించరా నా సామి కౌగలించరా నా సామి | valapu nilupalEnurA vagalumAni yElukOrA kaLalu dEra nokkasAri kaugalimcharA nA sAmi kaugalimcharA nA sAmi |
చరణం charaNam 3 | వనజ నయన నిశ్చలా వరద వేణుగోపబాలా ఘనుడ దాసు రామపాలా కాంక్ష దీర్చరా నా సామి కాంక్ష దీర్చరా నా సామి | vanaja nayana niSchalA varada vENugOpabAlA ghanuDa dAsu rAmapAlA kAmksha dIrcharA nA sAmi kAmksha dIrcharA nA sAmi |