Title | ఏమని తెల్పుదునే | Emani telpudunE |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | యేమని దెల్పుదునే కోమలి నా భాగ్య మేమని తెల్పుదునే నా ముద్దుసామికి నా మీది ప్రేమనే | yEmani delpudunE kOmali nA bhAgya mEmani telpudunE nA muddusAmiki nA mIdi prEmanE |
చరణం charaNam 1 | చెక్కిలి ముద్దాడెనె చక్కని నా సామి చెక్కిలి ముద్దాడెనె నిక్కముగ నిన్న రేయి పక్కనే పవ్వళించి చక్కని కెమ్మోవి నొక్కెనే అక్కనే | chekkili muddADene chakkani nA sAmi chekkili muddADene nikkamuga ninna rEyi pakkanE pavvaLimchi chakkani kemmOvi nokkenE akkanE |
చరణం charaNam 2 | బాళిచే నన్నేలనే కేళిలో నా సామి బాళిచే నన్నేలెనే వేళగదే రారమ్మని విలువగల సొమ్ములిచ్చి చాలగా లాలించి సోలెనే బాలెనే | bALichE nannElanE kELilO nA sAmi bALichE nannElenE vELagadE rArammani viluvagala sommulichchi chAlagA lAlimchi sOlenE bAlenE |
చరణం charaNam 3 | నా సాటి లేరనెనే వేణుగోపాలుడు నా సాటి లేరనెనే ఆసదీర్చి దాసు రామదాస చిత్త వాసుడాయె పూసెనే గంధము చేసెనే బాసనే | nA sATi lEranenE vENugOpAluDu nA sATi lEranenE AsadIrchi dAsu rAmadAsa chitta vAsuDAye pUsenE gandhamu chEsenE bAsanE |