Title | భామినిరొ రాగదె | bhAminiro rAgade |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థాని కాఫీ (1893) కాఫి (1991) | hindusthAni kAfI (1893) kAfi (1991) |
తాళం tALa | చాపు (1893) ఆది (1991) | chApu (1893) Adi (1991) |
పల్లవి pallavi | భామినిరొ రాగదె సామినీ తేవే కాముని బారికి తాళుదునే తాళుదునె నేనెటు తాళుదునే ఆ కామునీ బారికి తాళుదునే | bhAminiro rAgade sAminI tEvE kAmuni bAriki tALudunE tALudune nEneTu tALudunE A kAmunI bAriki tALudunE |
చరణం charaNam 1 | మొన్నా నిన్నా కూడిన చెలిపై మోహము నిండారగను నన్ను మరచెద గదవే మదవతీ వెన్నెల కాకకు తాళుదునే తాళుదునె నేనెటు తాళుదునె ఆ వెన్నెల కాకకు తాళుదునె | monnA ninnA kUDina chelipai mOhamu ninDAraganu nannu maracheda gadavE madavatI vennela kAkaku tALudunE tALudune nEneTu tALudune A vennela kAkaku tALudune |
చరణం charaNam 2 | చెల్లంబో నా సాటి చెలులలో చిన్నతనం బాయెనుగా మొల్ల విరుల మీది మెల్లని యీ చల్లగాలికి తాళుదునే తాళుదునె నేనెటు తాళుదునే యీ చల్లగాలికి తాళుదునే | chellambO nA sATi chelulalO chinnatanam bAyenugA molla virula mIdi mellani yI challagAliki tALudunE tALudune nEneTu tALudunE yI challagAliki tALudunE |
చరణం charaNam 3 | ప్రేమమీర దాసు కులజుడౌ రామకవిం బ్రోచుచును సామజవర వరదుండలిగెనే ఆమని ఢాకకు తాళుదునే | prEmamIra dAsu kulajuDau rAmakavim brOchuchunu sAmajavara varadumDaligenE Amani DhAkaku tALudunE |