Title | దయలేక | dayalEka |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థాని కాఫీ (1893) కాఫి (1991) | hindusthAni kAfI (1893) kAfi (1991) |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | దయలేక నీవు రాకయున్న తాళజాలరా | dayalEka nIvu rAkayunna tALajAlarA |
చరణం charaNam 1 | నిన్న రేయి కన్నులారా నిదుర లేదురా వన్నెకాడ నిదురాక కాచి యుంటిరా | ninna rEyi kannulArA nidura lEdurA vannekADa nidurAka kAchi yunTirA |
చరణం charaNam 2 | ఉత్త మాట గాదు నిన్నె గుత్తగుంటిరా చిత్తగించు నాదు మనవి చిన్నదానరా | utta mATa gAdu ninne guttagunTirA chittaginchu nAdu manavi chinnadAnarA |
చరణం charaNam 3 | శ్రీ సఖా నే జేసుకొన్న దోసమేమిరా వాసి మీర దాసురామ దాసునేలరా | SrI sakhA nE jEsukonna dOsamEmirA vAsi mIra dAsurAma dAsunElarA |