ఈ రచన పాత ప్రచురణలో శృంగార పద్యము గానూ, కొత్త ప్రచురణలో జావళి గానూ చెప్పబడినది. This was mentioned as a ‘SRngAra padyamu’ in the old publication and as a jAvaLi in the new publication.
Title | పోవోయి పోవోయి | pOvOyi pOvOyi |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | కాఫి | kAfi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | పోవోయి పోవోయి పొలతులతో నింత పోటాపోటీ లేమోయి వావిని ఈవాడ వనితలెల్లను నీకు వావారే వావారే వదిన మరదళ్ళైరి | pOvOyi pOvOyi polatulatO ninta pOTApOTI lEmOyi vAvini IvADa vanitalellanu nIku vAvArE vAvArE vadina maradaLLairi |
చరణం charaNam 1 | తల తడిపి తగని బాసలు జేసిన నమ్మదగిన కాలము గాదురా చెలువుడా మనయూరి వెలయాండ్రతో నీకు భళిభళి భాళిభళి బహరీ ఖాతాలాయె | tala taDipi tagani bAsalu jEsina nammadagina kAlamu gAdurA cheluvuDA manayUri velayAnDratO nIku bhaLibhaLi bhALIbhaLi baharI khAtAlAye |
చరణం charaNam 2 | వేషభాషలే చూపి విషమ చక్కె జేసి విడుతురోయి పురుషులు హాషామాషీ చెలియల సయ్యాటలు నీకు భేషు భేషు భేషు విజయ బిరుదములాయె | vEshabhAshalE chUpi vishama chakke jEsi viDuturOyi purushulu hAshAmAshI cheliyala sayyATalu nIku bhEshu bhEshu bhEshu vijaya birudamulAye |
చరణం charaNam 3 | బహురూపధర తోట్ల వల్లూరి వేణుగోపాలా యెంత జాణవు రహిమించు దాసుశ్రీరాముని పలుకులు అహ పహ్య అహహ హాయ మృత బిందువులాయె | bahurUpadhara tOTla vallUri vENugOpAlA yenta jANavu rahiminchu dAsuSrIrAmuni palukulu aha pahya ahaha hAya mRta binduvulAye |