ఈ రచన పాత ప్రచురణలో పదము గానూ, కొత్త ప్రచురణలో జావళి గానూ చెప్పబడినది. This was mentioned as a padamu in the old publication, and as a jAvaLi in the new publication.
Title | వనితరో | vanitarO |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | వనితరో యీ వన్నెలేలనే యీ వేళ నాకు తనువేలా తరుణలేలా ధనమేలా ధామమేలా | vanitarO yI vannelElanE yI vELa nAku tanuvElA taruNalElA dhanamElA dhAmamElA |
చరణం charaNam 1 | ఆకులేలా పోకలేలా అన్నమేలా పానమేలా శ్రీకరుండు రాకయుండి ఆకలుడిగి యున్నవేళ | AkulElA pOkalElA annamElA pAnamElA SrIkarunDu rAkayunDi AkaluDigi yunnavELa |
చరణం charaNam 2 | సొగసేలా సొమ్ములేలా అగరేలా గంధమేలా మగనికి దయలేక మేను సగమై యున్నట్టి వేళ | sogasElA sommulElA agarElA gandhamElA maganiki dayalEka mEnu sagamai yunnaTTi vELa |
చరణం charaNam 3 | భాసురాంగీ తోటలేలా పాటలేలా ఆటలేలా దాసురామ పాలుబాసి ఆసలుడిగి యున్నవేళ | bhAsurAngI tOTalElA pATalElA ATalElA dAsurAma pAlubAsi AsaluDigi yunnavELa |
AV Link | https://www.youtube.com/watch?v=sj8oQYpSKPU |