Title | కోపమా సామి | kOpamA sAmi |
Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
Book | dAsu1893 dAsu1991 | |
రాగం rAga | హిందుస్థాని కాఫీ కాఫి | hindusthAni kAfI kAfi |
తాళం tALa | అట చాపు | aTa chApu |
పల్లవి pallavi | కోపమా సామి యేమిర కోపమా అపరాదుర మోహము పరితాపమొందెర దేహము నను రాపుజేయుట ద్రోహము నీ రూపమైన జూపనేమిర | kOpamA sAmi yEmira kOpamA aparAdura mOhamu paritApamomdera dEhamu nanu rApujEyuTa drOhamu nI rUpamaina jUpanEmira |
చరణం charaNam 1 | వాదమా సామి నాతో వాదమా లేదురా బలవంతము యిది కాదురా యొక పంతము సరికాదురా యత్యంతము నీమీది తమి చేసేది తోచదు | vAdamA sAmi nAtO vAdamA lEdurA balavantamu yidi kAdurA yoka pantamu sarikAdurA yatyantamu nImIdi tami chEsEdi tOchadu |
చరణం charaNam 2 | వీడరా మోడి నాపై వీడరా ఆడుదానర దోసము కాపాడరా పరిహాసము నను గూడని నా వేసము మాటాడనైన గూడదటరా | vIDarA mODi nApai vIDarA ADudAnara dOsamu kApADarA parihAsamu nanu gUDani nA vEsamu mATADanaina gUDadaTarA |
చరణం charaNam 3 | దోసమా సామి నాపై దాసు రామ కవీంద్రుడు కృతి జేసె మృదు గుణ సాంద్రుడు పైగాసె వెన్నెల చంద్రుడు సేబాసురా యెంత మోసమాయెరా | dOsamA sAmi nApai dAsu rAma kavIndruDu kRti jEse mRdu guNa sAndruDu paigAse vennela chandruDu sEbAsurA yenta mOsamAyerA |