#356 అడవి ముషిణికాయ aDavi mushiNikAya

Titleఅడవి ముషిణికాయaDavi mushiNikAya
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893
dAsu1991
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఅట
మిశ్రచాపు
aTa
miSrachApu
పల్లవి pallaviఅడవి ముషిణికాయ యది నీకు ప్రియమాయె
అయ్యో నేనేమందురా
పడుచుతనము చేత భ్రమ జెందుటే గాని
పడతి సుఖము లేదు పదరా నీలివార్త
aDavi mushiNikAya yadi nIku priyamAye
ayyO nEnEmandurA
paDuchutanamu chEta bhrama jenduTE gAni
paDati sukhamu lEdu padarA nIlivArta
చరణం
charaNam 1
వింతవింతల మారి సంతమెరుగులాడి
తంతర గొట్టుదిరా
సంతోషమున దాని
సరస జేరుటె గాని
యింతి మంతనములు
ఎంమావుల నీళ్ళు
vintavintala mAri santamerugulADi
tantara goTTudirA
santOshamuna dAni
sarasa jEruTe gAni
yinti mantanamulu
em^mAvula nILLu
చరణం
charaNam 2
చేసితివౌ లేరా చెలియతో స్నేహము
చేతి సంచి వెచ్చము
ఆస చేత దాని నంట బోవుటె కాని
కాసు జేయదు వట్టి కట్టు గారిడి సామీ
chEsitivau lErA cheliyatO snEhamu
chEti sanchi vechchamu
Asa chEta dAni nanTa bOvuTe kAni
kAsu jEyadu vaTTi kaTTu gAriDi sAmI
చరణం
charaNam 3
కోపమెంచకు తోట్ల వల్లూరి శ్రీ వేణుగోపాల బాగాయెరా
శ్రీ పూర్ణుడగు దాసు శ్రీరామకవి వాక్య
వ్యాపారములు వేదాక్షరములు నమ్ము
kOpamenchaku tOTla vallUri SrI vENugOpAla bAgAyerA
SrI pUrNuDagu dAsu SrIrAmakavi vAkya
vyApAramulu vEdAksharamulu nammu

This is the last jAvaLi from dAsu SrIrAmulu collection. We have access more works by him, but each one is marked as padamu or SringAra padyamu.

దాసు శ్రీరాములు గారిచే రచింపబడిన జావళీలలో ఇది ఆఖరిది. మాకు దొరికిన మరి కొన్ని రచనలు జావళీలుగా కాక, పదాలుగా లేదా శృంగార పద్యాలుగా చెప్పబడ్డాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s