Title | మనవిని వినుమా | manavini vinumA |
Written By | యోగ నరసింహ | yOga narasim^ha |
Book | ||
రాగం rAga | వలచి | valachi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మనవిని వినుమా నా మనసుకు సుఖమొసగుము నిను బాసి సగమాయను మేను మనసు తల్లడిల్లెను | manavini vinumA nA manasuku sukhamosagumu ninu bAsi sagamAyanu mEnu manasu tallaDillenu |
పగవారు మమ్ము కలయలేక జేసి వేగించిరి గాని అనురాగము స్థిరముగ నుంచుము నా రాజ | pagavAru mammu kalayalEka jEsi vEginchiri gAni anurAgamu sthiramuga nunchumu nA rAja | |
ప్రేమమె నా ప్రాణాధారము ప్రియతమ దేవా నేమమె నా దినచర్య నీ యతి కొలది కలయగలము | prEmame nA prANAdhAramu priyatama dEvA nEmame nA dinacharya nI yati koladi kalayagalamu | |