Title | దారి జూచుచున్నది | dAri jUchuchunnadi |
Written By | తచ్చూరు సింగరాచార్య | tachcUru singarAchArya |
Book | ||
రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
తాళం tALa | ?? | ?? |
పల్లవి pallavi | దారి జూచుచున్నది నీదు ప్రియ తరళాక్షియో చిన్నది నీదు ప్రియా | dAri jUchuchunnadi nIdu priya taraLAkshiyO chinnadi nIdu priyA |
వారిజముఖి నీవు వచ్చే వేళానుకొని కోరికతో రాజగోపాల సామి దారి వెన్నెల గాయెగా | vArijamukhi nIvu vachchE vELAnukoni kOrikatO rAjagOpAla sAmi dAri vennela gAyegA | |
వేడ్క మీర మంచి యీ సన్న జాజి విరుల సరులు సుగంధము పన్నీరు చెంబులు పడకింటిలో నుంచి వన్నెలాడి తలవాకిట నిలచి నీ | vEDka mIra manchi yI sanna jAji virula sarulu sugandhamu pannIru chembulu paDakinTilO nunchi vannelADi talavAkiTa nilachi nI | |
పచ్చిపచ్చిగాను పదములు పాడుచు వచ్చి రాజగోపాల సామి నీవు ముచ్చట లాడుచు ముద్దులు పెట్టుచు గ్రుచ్చి కౌగలిచ్చి కూడుటం దలచి నీ | pachchipachchigAnu padamulu pADuchu vachchi rAjagOpAla sAmi nIvu muchchaTa lADuchu muddulu peTTuchu gruchchi kaugalichchi kUDuTam dalachi nI | |