Title | సామి నిన్నే | sAmi ninnE |
Written By | వీణ పద్మనాభయ్య | vINa padmanAbhayya |
Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
రాగం rAga | కమాచి | kamAchi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | సామి నిన్నే నమ్మినానురా సామగాన లోల చామ భూమి పాల జాలమేల | sAmi ninnE namminAnurA sAmagAna lOla chAma bhUmi pAla jAlamEla |
అనుపల్లవి anupallavi | నన్ను కౌగలించుటకు తామసంబు వలదురా అన్ని నీవైన నాదు విన్నపంబు వినుమురా తిరిగి జూడరా నన్ను గూడరా సరసమాడరా కృష్ణరాజ తనయ వినయ దయా హృదయ | nannu kaugalinchuTaku tAmasambu valadurA anni nIvaina nAdu vinnapambu vinumurA tirigi jUDarA nannu gUDarA sarasamADarA kRshNarAja tanaya vinaya dayA hRdaya |
చరణం charaNam 1 | జలజ నయన జలజ నాభ సమానమై వెలయు నీవె నాకు దైవము నీదే ధ్యానము ఓర్వ వశమా తమకము సార్వభౌమ సకలములకు | jalaja nayana jalaja nAbha samAnamai velayu nIve nAku daivamu nIdE dhyAnamu Orva vaSamA tamakamu sArvabhauma sakalamulaku |