Title | చాలు నీ వయ్యారము | chAlu nI vayyAramu |
Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
Book | రసరాజ వైభవ | rasarAja vaibhava |
రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చాలు నీ వయ్యారము చాలు చాలు నీ వయ్యారము చాలు చాలు నీ వయ్యారము లీల లేల కన్ను సైగ జేసేవేల | chAlu nI vayyAramu chAlu chAlu nI vayyAramu chAlu chAlu nI vayyAramu lIla lEla kannu saiga jEsEvEla |
అనుపల్లవి anupallavi | బాలా నీవు చాల కులుకుచు పలుకుచు మాలిక వేసితివేలా పూ మాలిక వేసితివేలా యనిన | bAlA nIvu chAla kulukuchu palukuchu mAlika vEsitivElA pU mAlika vEsitivElA yanina |
చరణం charaNam 1 | కాల హరణ మేలనే తరుణి పాలుమాలిక లేలనే నాలో విరహ భావంబుల తెప్పించి లోలాక్షి నను జూచి ముసి ముసి నవ్వుట | kAla haraNa mElanE taruNi pAlumAlika lElanE nAlO viraha bhAvambula teppinchi lOlAkshi nanu jUchi musi musi navvuTa |
చరణం charaNam 2 | మరుకేళి గూడుమని నాతో మరుమాట లాడకుమని చెప్పితె సరసుడైన ఈ తాళవనేశుని మెరుగు సొమ్ములు కాసులడుగేవుట | marukELi gUDumani nAtO marumATa lADakumani cheppite sarasuDaina I tALavanESuni merugu sommulu kAsulaDugEvuTa |