Title | సమయము గాదురా | samayamu gAdurA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | యమన్ | yaman |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | సమయము గాదురా సామి లేచిపోరా సామి లేచిపోరా జాగు చేసేవేరా | samayamu gAdurA sAmi lEchipOrA sAmi lEchipOrA jAgu chEsEvErA |
చరణం charaNam 1 | చేయి పట్టి నా సిగ్గు చెఱచకురా సామి వేయి విధముల నే వేడుకొన్న వినవు | chEyi paTTi nA siggu che~rachakurA sAmi vEyi vidhamula nE vEDukonna vinavu |
చరణం charaNam 2 | అత్తింటి కోడలని ఆలోచింపక చిత్తజు కేళికాయత్తమై యున్నావు | attinTi kODalani AlOchimpaka chittaju kELikAyattamai yunnAvu |
చరణం charaNam 3 | ఇంటి వారందఱు నిట్టట్టు తిరిగేరు కంటికి తెలియక కదలి పోరా ఇది | inTi vAranda~ru niTTaTTu tirigEru kanTiki teliyaka kadali pOrA idi |
చరణం charaNam 4 | రాజగోపాల రట్టు సేయుటేల సాజముగా మఱొక సారి వత్తువు గాని | rAjagOpAla raTTu sEyuTEla sAjamugA ma~roka sAri vattuvu gAni |