Title | చేర రావదేమిర | chEra rAvamadEmira |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
పల్లవి pallavi | చేర రావదేమిర చెప్పవదేమిర మారకోటి సుందర మరులైతి గదర | chEra rAvadEmira cheppavadEmira mArakOTi sundara marulaiti gadara |
చరణం charaNam 1 | నిను జూడని యొక నిమిషమే యుగముగా మనమున నెంచుచు మమత జెందితిర | ninu jUDani yoka nimishamE yugamugA manamuna nenchuchu mamata jenditira |
చరణం charaNam 2 | పిలిపించిన రావు పిలిచిన పలుకవు తలపులు వేఱై తల్లడ పెట్టేవు | pilipinchina rAvu pilichina palukavu talapulu vE~rai tallaDa peTTEvu |
చరణం charaNam 3 | రసికుడైన శ్రీరాజ గోపాల కొసరి వేడినను కసటుగా జూచుచు | rasikuDaina SrIrAja gOpAla kosari vEDinanu kasaTugA jUchuchu |