Title | చాలు చాలు పోరా | chAlu chAlu pOrA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | చాలు చాలు పోరా ఓరి సామి | chAlu chAlu pOrA Ori sAmi |
చరణం charaNam 1 | బాలనురా నన్ను బలిమిని బట్టేవు లాలించుట కిది వేళగాదుర సామి | bAlanurA nannu balimini baTTEvu lAlinchuTa kidi vELagAdura sAmi |
చరణం charaNam 2 | కుదురు పడని నాదు కుచముల నంటేవు పదరుట నీకిది బాడి గాదుర సామి | kuduru paDani nAdu kuchamula nanTEvu padaruTa nIkidi bADi gAdura sAmi |
చరణం charaNam 3 | ప్రజలు విన్నను నగుబాటు కల్గును నీకు నిజముగ నైదాఱు నెలలు తాళుకోర | prajalu vinnanu nagubATu kalgunu nIku nijamuga naidA~ru nelalu tALukOra |
చరణం charaNam 4 | రచ్చ సేయకిపుడు రాజగోపాల పచ్చవిల్తు కేళి పరగ కూడుదు గాని | rachcha sEyakipuDu rAjagOpAla pachchaviltu kELi paraga kUDudu gAni |