Title | సామి రాడాయెనే | sAmi rADAyenE |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
పల్లవి pallavi | సామి రాడాయెనే సరగున రమ్మనవే నా మనోహరుని కేభామ బోధించెనో | sAmi rADAyenE saraguna rammanavE nA manOharuni kEbhAma bOdhinchenO |
చరణం charaNam 1 | ఇంతి వాని దలచితే మది ఎంతయు రంజిల్లునే కంతు బారి కోర్వలేక కరగు చుండుటే కాని | inti vAni dalachitE madi entayu ranjillunE kantu bAri kOrvalEka karagu chunDuTE kAni |
చరణం charaNam 2 | నిమిషమైన నను జూడక నిలిచి యుండ జాలడే రమణు డిపుడు చలము జేసి రట్టు చేయ బూనెనే | nimishamaina nanu jUDaka nilichi yunDa jAlaDE ramaNu DipuDu chalamu jEsi raTTu chEya bUnenE |
చరణం charaNam 3 | రామరో నన్నేలిన రాజగోపాలుడే ప్రేమ సుంతైన లేక మోహము జూప కున్నాడే | rAmarO nannElina rAjagOpAluDE prEma suntaina lEka mOhamu jUpa kunnADE |