Title | రారా సామిగా | rArA sAmigA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | రారా సామిగా వేగమే ప్రియ సఖినేల సమయమిదేర రమణి తాళలేదురా మనవి చేకోరా | rArA sAmigA vEgamE priya sakhinEla samayamidEra ramaNi tALalEdurA manavi chEkOrA |
చరణం charaNam 1 | మారుబారి కోర్వక మమత జెంది నీదారి జూచు చున్నదిరా దయ యుంచి | mArubAri kOrvaka mamata jendi nIdAri jUchu chunnadirA daya yunchi |
చరణం charaNam 2 | చెలులు మాటాడిన చెవి యిచ్చి వినదురా తలపంత నీపైనిరా దయ యుంచి | chelulu mATADina chevi yichchi vinadurA talapanta nIpainirA daya yunchi |
చరణం charaNam 3 | విడెమని అస్నమని వేడుకని నిదురని పడతికి లేదురా దయ యుంచి | viDemani asnamani vEDukani nidurani paDatiki lEdurA daya yunchi |
చరణం charaNam 4 | రమణి నీ యాసచే రాజగోపాల ప్రాణము నిలుపు కొన్నదిరా దయ యుంచి | ramaNi nI yAsachE rAjagOpAla prANamu nilupu konnadirA daya yunchi |