Title | మేరగాదురా | mEragAdurA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | చతురశ్ర లఘువు | chaturaSra laghuvu |
పల్లవి pallavi | మేరగాదురా నీకిది సామి ఇది కోరిన చెలినిటు వేఱుగ దలచుట | mEragAdurA nIkidi sAmi idi kOrina cheliniTu vE~ruga dalachuTa |
చరణం charaNam 1 | సారెసారెకా చానను నేలుచు వారిజాక్ష నను వంచన చేయుట | sAresArekA chAnanu nEluchu vArijAksha nanu vanchana chEyuTa |
చరణం charaNam 2 | వాసి కెక్కిన వాడని నమ్మితే గాసి పెట్టి నను మోసము చేయుట | vAsi kekkina vADani nammitE gAsi peTTi nanu mOsamu chEyuTa |
చరణం charaNam 3 | వరద రాజగోపాల సామి కరుణ మాని నను నిరతము దూఱుట | varada rAjagOpAla sAmi karuNa mAni nanu niratamu dU~ruTa |