Title | ఊరక చలమేల | Uraka chalamEla |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | తిశ్ర లఘువు | tiSra laghuvu |
పల్లవి pallavi | ఊరక చలమేల నీకిది మేరగాదురా సామి వారిజాక్షి వలచిన నను గారవించి చూడరా | Uraka chalamEla nIkidi mEragAdurA sAmi vArijAkshi valachina nanu gAravinchi chUDarA |
చరణం charaNam 1 | పద్దు చేయ వలదుర నా యొద్దికి రారా సుద్దులనే తేలించి ప్రొద్దు పుచ్చకురా | paddu chEya valadura nA yoddiki rArA suddulanE tElinchi proddu puchchakurA |
చరణం charaNam 2 | తరుణుల వలె నే వలపు దాచ జాలరా మరునిల్లు చెమ్మగిలి మైమఱవ సాగెరా | taruNula vale nE valapu dAcha jAlarA marunillu chemmagili maima~rava sAgerA |
చరణం charaNam 3 | అక్కఱ తెలిసికొని నీదు ప్రక్క జేర్చరా ఎక్కువైన రతులచే గ్రక్కున నను నేలుకోరా | akka~ra telisikoni nIdu prakka jErcharA ekkuvaina ratulachE grakkuna nanu nElukOrA |
చరణం charaNam 4 | పచ్చ విల్తు కేళి సుఖము పడయ జేయరా రచ్చ సేయ వలదురా రాజగోపాల సామి | pachcha viltu kELi sukhamu paDaya jEyarA rachcha sEya valadurA rAjagOpAla sAmi |