Title | మాయ చేసేవేరా | mAya chEsEvErA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | మాయ చేసేవేరా నాతో సామి నాతో | mAya chEsEvErA nAtO sAmi nAtO |
చరణం charaNam 1 | హాయి మీఱ నిన్న రేయి దాని ననుభవించలేదా ఱాయివంటి దాయె లేర నీమది రాను రాను జాడలెల్ల దెలిసెర | hAyi mI~ra ninna rEyi dAni nanubhavinchalEdA ~rAyivanTi dAye lEra nImadi rAnu rAnu jADalella delisera |
చరణం charaNam 2 | నల్లవాని నమ్మరాదనే నుడి సల్లగాదు గదరా చెల్లదురా నీ నడతలు నా యెడ చేరరాకు దక్కితినని పలుకుచు | nallavAni nammarAdanE nuDi sallagAdu gadarA chelladurA nI naDatalu nA yeDa chErarAku dakkitinani palukuchu |
చరణం charaNam 3 | తరుణి యెట్టి వలపు మందు పెట్టెనొ తాళ లేవు గదరా సరసుడైన రాజగోపాల చాలు చాలు వగలు చేయకుర ఇట | taruNi yeTTi valapu mandu peTTeno tALa lEvu gadarA sarasuDaina rAjagOpAla chAlu chAlu vagalu chEyakura iTa |