Title | ఎందుకే యాచలము | endukE yAchalamu |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఎందుకే యాచలము నీ కిందు వదనరో సుందరాంగి నిన్ను జూచి సొక్కి చాల మరులు కొంటి | endukE yAchalamu nI kindu vadanarO sundarAngi ninnu jUchi sokki chAla marulu konTi |
చరణం charaNam 1 | నిను బాసి నిదుర రాదు నిమిషమైన ప్రొద్దు పోదు మనసిజు బారి కోర్వరాదు మమత నిలుప పశము గాదు | ninu bAsi nidura rAdu nimishamaina proddu pOdu manasiju bAri kOrvarAdu mamata nilupa paSamu gAdu |
చరణం charaNam 2 | తరుణిరో నే తాళజాల దయ నాపై దాచనేల కరుణ యుంచి యీ వేళ కలయుట కిక జాగులేల | taruNirO nE tALajAla daya nApai dAchanEla karuNa yunchi yI vELa kalayuTa kika jAgulEla |
చరణం charaNam 3 | కోపము నాపై మాను కోమలి నిను నమ్మినాను ప్రాపు కోరి వచ్చినాను పరక నీకు పుణ్యమౌను | kOpamu nApai mAnu kOmali ninu namminAnu prApu kOri vachchinAnu paraka nIku puNyamaunu |