Title | రారా రమ్మనెరా | rArA rammanerA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | రారా రమ్మనెరా చెలియ నిను మారుబారి కోర్వలేక వేగమే | rArA rammanerA cheliya ninu mArubAri kOrvalEka vEgamE |
చరణం charaNam 1 | కోరి యున్నదిరా సుదతిపై కోపము చేయకురా సరోజ ముఖి విరాళి మై మఱచెనురా ఇటు విరసము తగదుర | kOri yunnadirA sudatipai kOpamu chEyakurA sarOja mukhi virALi mai ma~rachenurA iTu virasamu tagadura |
చరణం charaNam 2 | చలమేలరా మగువకును సాటెవరున్నారురా విలాసముగను నేలుటకు సమయమురా మనవిని విని కరుణను | chalamElarA maguvakunu sATevarunnArurA vilAsamuganu nEluTaku samayamurA manavini vini karuNanu |
చరణం charaNam 3 | రాజగోపాలా నీకిటుల రాజసమేలా నిజమ్ముగను సదా వలచినది వినురా మునుపటి దయ తలచుచు | rAjagOpAlA nIkiTula rAjasamElA nijammuganu sadA valachinadi vinurA munupaTi daya talachuchu |