Title | రారా మనవి | rArA manavi |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | రారా మనవి చేకోరా మారుని బారికి నోర్వగ లేర | rArA manavi chEkOrA mAruni bAriki nOrvaga lEra |
చరణం charaNam 1 | వలచినట్టి నను చులకన సేయుట మేరా సామి పలుకవ దేరా చలము మాని కలసెడు సరసులు లేరా సుకుమారా సమయమిదేర | valachinaTTi nanu chulakana sEyuTa mErA sAmi palukava dErA chalamu mAni kalaseDu sarasulu lErA sukumArA samayamidEra |
చరణం charaNam 2 | చెలుల బోధనలు విని నను నాడగలేదా నాతో పలుమాఱు వాదా సలిపినట్టి చెలిమిని మది నిడరాదా మరియాదా వంచన పోదా | chelula bOdhanalu vini nanu nADagalEdA nAtO palumA~ru vAdA salipinaTTi chelimini madi niDarAdA mariyAdA vanchana pOdA |
చరణం charaNam 3 | రాను రాను నీ గుణమిటు లాయెన దేలా శ్రీ రాజ గోపాలా కానివారు నవ్వగ బ్రదుకిక నేలా శ్రీ లోలా తాళగ జాల | rAnu rAnu nI guNamiTu lAyena dElA SrI rAja gOpALA kAnivAru navvaga bradukika nElA SrI lOlA tALaga jAla |