Title | న్యాయమేమిరా | nyAyamEmirA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | న్యాయమేమిరా నీకిది సామి వేయి మాట లేలర నా విభుడని నెఱ నమ్మినార మాయలాడి బోధనకే మమత జెంది యుండ నీకు | nyAyamEmirA nIkidi sAmi vEyi mATa lElara nA vibhuDani ne~ra namminAra mAyalADi bOdhanakE mamata jendi yunDa nIku |
చరణం charaNam 1 | విరహ మోర్వరా నను వేగ నేలరా మరుడు నా యురమునను విరి శరముల వడి నేసెనురా కరుణ మఱవ వలదుర యీ కాయము నీ సొమ్మేర | viraha mOrvarA nanu vEga nElarA maruDu nA yuramunanu viri Saramula vaDi nEsenurA karuNa ma~rava valadura yI kAyamu nI sommEra |
చరణం charaNam 2 | పంతమేలరా సామి పాడి గాదురా అంతరంగ మెఱిగి నన్నిటు లారడి పెట్టేవదేర చెంత జేరి తావులంటి వింత రతుల గూడవేర | pantamElarA sAmi pADi gAdurA antaranga me~rigi nanniTu lAraDi peTTEvadEra chenta jEri tAvulanTi vinta ratula gUDavEra |
చరణం charaNam 3 | వలచినానురా నాపై చలము మానురా అలగి యుండు టేలర నా యపరాధము లేమిరా పలుకవేర రాజగోపాల నీకు మ్రొక్కేరా | valachinAnurA nApai chalamu mAnurA alagi yunDu TElara nA yaparAdhamu lEmirA palukavEra rAjagOpAla nIku mrokkErA |