Title | మనసిజు బారికి | manasiju bAriki |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | మనసిజు బారికి నెటులోర్తునే వనితరో విభు నెడబాసిన మొదలు దినమొక యుగమాయెనే | manasiju bAriki neTulOrtunE vanitarO vibhu neDabAsina modalu dinamoka yugamAyenE |
చరణం charaNam 1 | ముదితరో రమణిపై మోహమగ్గలమై నిదురయు రాదాయెనే | muditarO ramaNipai mOhamaggalamai nidurayu rAdAyenE |
చరణం charaNam 2 | కన్నెరో చెలువుని కనుల జూడమిచే అన్నము సైచ దాయెనే | kannerO cheluvuni kanula jUDamichE annamu saicha dAyenE |
చరణం charaNam 3 | పణతిరో రాజ గోపాలుడు నాపై కనికర మెంచ డాయెనే | paNatirO rAja gOpAluDu nApai kanikara mencha DAyenE |