Title | తామసమేలరా | tAmasamElarA |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | సురటి | suraTi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | తామసమేలరా నా మనోహర తాళగ జాలనురా | tAmasamElarA nA manOhara tALaga jAlanurA |
కాముడు నాపై కరుణ దప్పెనురా కళ లంటి నను గూడరా | kAmuDu nApai karuNa dappenurA kaLa lanTi nanu gUDarA | |
మునుపటి దయ నీ మనసున లేదా మోహము దీర్చరా చక్కగ నాపై చనువు చూపకు మని సవతి చెప్పెనటరా | munupaTi daya nI manasuna lEdA mOhamu dIrcharA chakkaga nApai chanuvu chUpaku mani savati cheppenaTarA | |
అంతరంగుడవై అరమర చేయుట వింతగ నున్నదిరా రమణుడైన శ్రీ రాజ గోపాలా సమయము దెలసి కోరా | antaranguDavai aramara chEyuTa vintaga nunnadirA ramaNuDaina SrI rAja gOpAlA samayamu delasi kOrA | |