Title | రారా మా రమణి | rArA mA ramaNi |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | మిశ్ర లఘువు | miSra laghuvu |
రారా మా రమణి తాళలేదురా ||సామి|| | rArA mA ramaNi tALalEdurA ||sAmi|| | |
తాళలేదురా ఇది పాడి గాదురా ||సామి|| ||రా|| | tALalEdurA idi pADi gAdurA ||sAmi|| ||rA|| | |
మారుబారి వేమఱు సొమ్మ సిల్లినది ||రా|| | mArubAri vEma~ru somma sillinadi ||rA|| | |
చెలులతో నెప్పుడు పలుకదురా నిన్నే తలచుచు నున్నదిరా సామి నిన్నె | chelulatO neppuDu palukadurA ninnE talachuchu nunnadirA sAmi ninne | |
అన్న పానములపై ఆశయే లేదురా కన్నె నిక నేలురా దయ యుంచి | anna pAnamulapai ASayE lEdurA kanne nika nElurA daya yunchi | |
రసికుడైన శ్రీ రాజ గోపాల రట్టు సేయుటేలరా చెలి నిటు | rasikuDaina SrI rAja gOpAla raTTu sEyuTElarA cheli niTu | |