Title | మగువరో వానిపైని | maguvarO vAnipaini |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
పల్లవి pallavi | మగువరో వానిపైని మమత యెటుల తీఱునే | maguvarO vAnipaini mamata yeTula tI~runE |
చరణం charaNam 1 | పొగరున సుమ శరుడు పొంచి విలు వంచెనే అంతంతకు తమి మించెనే | pogaruna suma SaruDu ponchi vilu vanchenE antantaku tami minchenE |
చరణం charaNam 2 | వానితో సుఖింపని ప్రాయమది యేటికే ఈ కాయమది యేటికే | vAnitO sukhimpani prAyamadi yETikE I kAyamadi yETikE |
చరణం charaNam 3 | రతి పతి గన్న శ్రీ రాజ గోపాలుడే ఉదార గుణ శీలుడే | rati pati ganna SrI rAja gOpAluDE udAra guNa SIluDE |