Title | కాసా నీ చెలి నే | kAsA nI cheli nE |
Written By | ధర్మపురి? | dharmapuri? |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
Previously Published At | 47 | |
పల్లవి pallavi | కాసా నీ చెలి నే గాదటర నీ బాసలెల్ల ఏమాయెనురా | kAsA nI cheli nE gAdaTara nI bAsalella EmAyenurA |
చరణం charaNam 1 | సారుకు నా సరిపారి యెదుట నిన్ను రారా రారా రారా యని పిలిచిన | sAruku nA saripAri yeduTa ninnu rArA rArA rArA yani pilichina |
చరణం charaNam 2 | ఆ సతులతో పరిహాసము సలుపగ రోసముతో ఒరోరని పిలిచిన | A satulatO parihAsamu salupaga rOsamutO orOrani pilichina |
చరణం charaNam 3 | రేపగలని భేదము లెంచక నే నీపైకొని యుపరతులను సలిపిన | rEpagalani bhEdamu lenchaka nE nIpaikoni yuparatulanu salipina |
చరణం charaNam 4 | మాటలోన పొరపాటు లేని నీ మాటలెల్ల బల్ సూటిగ నేర్చిన | mATalOna porapATu lEni nI mATalella bal sUTiga nErchina |
చరణం charaNam 5 | ధర్మపురిని నెలకొన్న సామి శ్రీ నిర్మలమగు మకుటేశుని సాక్షిగ | dharmapurini nelakonna sAmi SrI nirmalamagu makuTESuni sAkshiga |