Title | వాని జోలి | vAni jOli |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | చాపు | chApu |
Posted before | 378 | |
పల్లవి pallavi | వాని జోలి నాకేలే ఇందుముఖిరో ఆ వనిత బోధనచే మైమఱచె | vAni jOli nAkElE indumukhirO A vanita bOdhanachE maima~rache |
చరణం charaNam 1 | మానినిరో వాని మమత లెందు బోయె పూని దాని యిలు విడిచి రాక యున్నాడిక | mAninirO vAni mamata lendu bOye pUni dAni yilu viDichi rAka yunnADika |
చరణం charaNam 2 | ఇంతిరో నిను బాయనని నాతో ఎన్నో బూటకములు పలికెనే సంతసమెల్ల నా చాన కొసగి నన్ను పంతముతో మరుని పాలు చేసెనిక | intirO ninu bAyanani nAtO ennO bUTakamulu palikenE santasamella nA chAna kosagi nannu pantamutO maruni pAlu chEsenika |
చరణం charaNam 3 | మాట తప్పని వాడని నేను మనసున నెంచితి గదనే బోటిరో అలవాని మోము జూడనగునా సాటి వారలు నవ్వ జాలరేమె యిక | mATa tappani vADani nEnu manasuna nenchiti gadanE bOTirO alavAni mOmu jUDanagunA sATi vAralu navva jAlarEme yika |
చరణం charaNam 4 | శింగర నుతుడు నాతో మును చేసిన చెలిమిని మఱచెనే బంగారము వంటి వాని గుణము లెల్ల అంగనా మణి మోహాబ్ధి జేరెనిక | Singara nutuDu nAtO munu chEsina chelimini ma~rachenE bangAramu vanTi vAni guNamu lella anganA maNi mOhAbdhi jErenika |