Title | ఎన్నాళ్ళు సైరింతునే | ennALLu sairintunE |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | చాపు | chApu |
Previously at | 395 | |
పల్లవి pallavi | ఎన్నాళ్ళు సైరింతునే ఓ చెలియ నే సామిని తోడితేవే | ennALLu sairintunE O cheliya nE sAmini tODitEvE |
చరణం charaNam 1 | క్రొన్నన విల్తుడు కోపము తోను తిన్నగ నాపై శరము లేసెనే ||సా|| ||ఎ|| | kronnana viltuDu kOpamu tOnu tinnaga nApai Saramu lEsenE ||sA|| ||e|| |
చరణం charaNam 2 | కనుల పండువై కాచెడు వెన్నెల మనసు కెంతో గాసిని బుట్టించెనే ||సా|| ||ఎ|| | kanula panDuvai kAcheDu vennela manasu kentO gAsini buTTinchenE ||sA|| ||e|| |
చరణం charaNam 3 | కోకిల లెల్ల గుంపులు గూడి ఓ కమలాక్షి రవములు గావించెనే ||సా|| ||ఎ|| | kOkila lella gumpulu gUDi O kamalAkshi ravamulu gAvinchenE ||sA|| ||e|| |
చరణం charaNam 4 | శింగర నుతుడు చెంగట బాసి అంగన గూడి ఇందు రాకున్నాడె ||సా|| ||ఎ|| | Singara nutuDu chengaTa bAsi angana gUDi indu rAkunnADe ||sA|| ||e|| |