Title | రమణిరో సామిని | ramaNirO sAmini |
Written By | తచ్చూరు శింగరాచార్యులు | tachchUru SingarAchAryulu |
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously posted at | ||
పల్లవి pallavi | రమణిరో సామిని రమ్మనవే రమ్మనవే మనవి చేకొమ్మనే వేగ | ramaNirO sAmini rammanavE rammanavE manavi chEkommanE vEga |
చరణం charaNam 1 | సుమ శరుడలరుల సూటిగా వేసెనే సమయ మిదేయని సామికి దెలుపవే | suma SaruDalarula sUTigA vEsenE samaya midEyani sAmiki delupavE |
చరణం charaNam 2 | సవతిల్లు వానికి సతమాయె గదవే ఎవతె బోధించెనో హితవుగ వానికి | savatillu vAniki satamAye gadavE evate bOdhinchenO hitavuga vAniki |
చరణం charaNam 3 | రాజగోపాలుడా రమణిని గూడి తేజరిల్లుచు చెలిమి దిటవుగ మఱచెనే | rAjagOpAluDA ramaNini gUDi tEjarilluchu chelimi diTavuga ma~rachenE |