Title | ఏమి సేతు | Emi sEtu |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | రూపక | rUpaka |
Previously posted at | 6, 203 | |
పల్లవి pallavi | ఏమి సేతు ఎటుల సైతు మరులు తాళ లేనురా సామి ధర్మపురి నివాస సమయము నన్నేలుకోరా | Emi sEtu eTula saitu marulu tALa lEnurA sAmi dharmapuri nivAsa samayamu nannElukOrA |
చరణం charaNam 1 | పిలువ పిలువ బిగువులు చేసేది మేరగాదురా అలుక నాటి సుఖము కోరి చెలువుడ దయ చేయు మిపుడు | piluva piluva biguvulu chEsEdi mEragAdurA aluka nATi sukhamu kOri cheluvuDa daya chEyu mipuDu |
చరణం charaNam 2 | మాటిమాటికిని వేడమట్టు విడువ బాగాయె గట్టు విల్తు పోరు ఇపుడు మట్టు మీఱి వచ్చెనయ్యో | mATimATikini vEDamaTTu viDuva bAgAye gaTTu viltu pOru ipuDu maTTu mI~ri vachchenayyO |
చరణం charaNam 3 | రామ ప్రాణ సఖిని బాసి రాము డెటుల తాళెనో ప్రేమ మీఱ మాటలాడ సామి చేర రారా ఇపుడు | rAma prANa sakhini bAsi rAmu DeTula tALenO prEma mI~ra mATalADa sAmi chEra rArA ipuDu |