Title | చక్కని సామి | chakkani sAmi |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | బ్యాగు | byAgu |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 41 | |
పల్లవి pallavi | చక్కని సామి మాట్లాడవదేరా చలమిటు నాతో సేయకురా | chakkani sAmi mATlADavadErA chalamiTu nAtO sEyakurA |
చరణం charaNam 1 | కలకాలము సలిపిన నేస్తము చెలువుడ మఱచుట తగునేరా | kalakAlamu salipina nEstamu cheluvuDa ma~rachuTa tagunErA |
చరణం charaNam 2 | రారా నన్నిటు రాపు జేసేవురా రచ్చకు మది నేనోర్వనురా | rArA nanniTu rApu jEsEvurA rachchaku madi nEnOrvanurA |
చరణం charaNam 3 | ఏలిన ప్రీతి నీకేమాయెనురా ఎంతని నిన్ను నే వేడుదురా | Elina prIti nIkEmAyenurA entani ninnu nE vEDudurA |
చరణం charaNam 4 | ఏనా సవతి నీకేమి బోధించెరా ఎందుకు నాపై కోపమురా | EnA savati nIkEmi bOdhincherA enduku nApai kOpamurA |
చరణం charaNam 5 | సారోదారుడౌ సదయ భీమేశ సరసతో నన్ను గూడవదేమిరా | sArOdAruDau sadaya bhImESa sarasatO nannu gUDavadEmirA |