Title | రా రమ్మనే | rA rammanE |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రా రమ్మనే రమ్మనే సామిని ఇటు | rA rammanE rammanE sAmini iTu |
రతిపతి బాధ యిక రమణి యోర్వజాల | ratipati bAdha yika ramaNi yOrvajAla | |
చరణం charaNam 1 | చెలి యెదురుగ నే బలిమితో బలికిన పలుకులు మదినిక తలచ వలదు ఇటు | cheli yeduruga nE balimitO balikina palukulu madinika talacha valadu iTu |
చరణం charaNam 2 | పరిపరి విధముల పంతగించితినని విరసము సలుపుట తరము గాదు ఇటు | paripari vidhamula pantaginchitinani virasamu salupuTa taramu gAdu iTu |
చరణం charaNam 3 | నెఱనమ్మినదని నెలత ననుచు కనికరము గలిగి శ్రీ తిరుపతీశు నిటు | ne~ranamminadani nelata nanuchu kanikaramu galigi SrI tirupatISu niTu |