#488 ఈ మరుబారికి I marubAriki

Titleఈ మరుబారికిI marubAriki
Written By
BookగాయకలోచనముgAyakalOchanamu
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaచాపుchApu
Previously Posted At163
పల్లవి pallaviఈ మరుబారికి తాళగలేనే
స్మర మోహన సుందరు బాసి
I marubAriki tALagalEnE
smara mOhana sundaru bAsi
చరణం
charaNam 1
తమినాటిన చిత్తము నెంచుచు ఈ
శ్రమ నంతయు నా కరుణాగ్రణి తో
సమయ మఱచుట దెల్పవే కృప సల్పవే
కామినీ మణి సామి లేక
యామిని నేనేమి సేయుదు
taminATina chittamu nenchuchu I
Srama nantayu nA karuNAgraNi tO
samaya ma~rachuTa delpavE kRpa salpavE
kAminI maNi sAmi lEka
yAmini nEnEmi sEyudu
చరణం
charaNam 2
మదిరాక్షిరొ శ్రీ హృదయేశుని నా
సదనంబున కేగుదు రాయని యే
సుదతి బోధన చేసెనో మది రోసెనో
సదయుడై నం గదియునని నే
నిదుర లేకే యెదురు చూచితి
madirAkshiro SrI hRdayESuni nA
sadanambuna kEgudu rAyani yE
sudati bOdhana chEsenO madi rOsenO
sadayuDai nan gadiyunani nE
nidura lEkE yeduru chUchiti
చరణం
charaNam 3
మలయాద్రి తటి నిలయా నిలునిచే
కలకాలము నే చెలి యింత వెతను
తలచినను కృప రాదటే పలువాదటే
బాలరో శ్రీ బాలచంద్రుని
కేళిలో నే నోలలాడగ
malayAdri taTi nilayA nilunichE
kalakAlamu nE cheli yinta vetanu
talachinanu kRpa rAdaTE paluvAdaTE
bAlarO SrI bAlachandruni
kELilO nE nOlalADaga

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s