Title | మరపు రాదే | marapu rAdE |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
Previously Posted At | 171 | |
పల్లవి pallavi | మఱపు రాదే చెలి వర గోప బాలుని వగలు | ma~rapu rAdE cheli vara gOpa bAluni vagalu |
చరణం charaNam 1 | కాంత వినవే చంద్ర కాంతపు మేడలో కాంతుడు నేనేకాంత మాడినది | kAnta vinavE chandra kAntapu mEDalO kAntuDu nEnEkAnta mADinadi |
చరణం charaNam 2 | ఇద్దరు గూడి నిలువు టద్దము లోపల సుద్దులు తేలించి రతి సుద్దు లాడినది | iddaru gUDi niluvu Taddamu lOpala suddulu tElinchi rati suddu lADinadi |
చరణం charaNam 3 | వాసిగ నను పంతి చేసెడి వేళలో నాయాసపు చెమటలు తీసి వేసినది | vAsiga nanu panti chEseDi vELalO nAyAsapu chemaTalu tIsi vEsinadi |
చరణం charaNam 4 | చిత్తజు కేళికి యత్నమై యున్న నాకు ముత్య సరము లిచ్చి ముద్దు పెట్టినది | chittaju kELiki yatnamai yunna nAku mutya saramu lichchi muddu peTTinadi |