Title | వాడెటు పల్కెనో | vADeTu palkenO |
Written By | ||
Book | గాయకలోచనము | gAyakalOchanamu |
రాగం rAga | మాంజి | mAnji |
తాళం tALa | చాపు | chApu |
Previously Posted At | 16, 183 | |
పల్లవి pallavi | వాడెటు పల్కెనో తెల్పవే బోటిరో బూటకమేలనే | vADeTu palkenO telpavE bOTirO bUTakamElanE |
చరణం charaNam 1 | కొమ్మరో నేనంపిన కమ్మను వాడేకొననో వాని చెలి చేతి కిమ్మనెనో | kommarO nEnampina kammanu vADEkonanO vAni cheli chEti kimmanenO |
చరణం charaNam 2 | ఇంతిరో నే బంపిన పూబంతులు వాడె కొనెనో వాని రమణి కిమ్మనెనో | intirO nE bampina pUbantulu vADe konenO vAni ramaNi kimmanenO |
చరణం charaNam 3 | రమ్మని పిల్వగ ఈడకు వాడే వచ్చెనో వచ్చేననిన వాని చెలి పోవద్దెనెనో | rammani pilvaga IDaku vADE vachchenO vachchEnanina vAni cheli pOvaddenenO |
చరణం charaNam 4 | బాలరో ధర్మపురి పాలుడు నన్నె లేననెనో ఏలేను పో పొమ్మనెనో | bAlarO dharmapuri pAluDu nanne lEnanenO ElEnu pO pommanenO |