Title | ఇన్నాళ్ళ వలె | innALLa vale |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఏక | Eka |
Previously Posted At | 33, 189 | |
పల్లవి pallavi | ఇన్నాళ్ళ వలె గాదే వాని గుణమెంతని నే విన్నవింతునే ఓ చెలియ | innALLa vale gAdE vAni guNamentani nE vinnavintunE O cheliya |
చరణం charaNam 1 | నన్నెడ బాయడు అన్యుల జూడడు మన్నన విడడు మానినీ మణిరో వన్నె కాడే ఎందున్నాడే ఇందు రాడే వాడన్నిట నెఱజాణుడే | nanneDa bAyaDu anyula jUDaDu mannana viDaDu mAninI maNirO vanne kADE endunnADE indu rADE vADanniTa ne~rajANuDE |
చరణం charaNam 2 | తామస మేలనే తాళగ జాలనే కోమలి నీ మది కోరిన సొమ్ములు చేకొనవే వేగ రావే తోడి తేవే నా సామి నిటు రమ్మనవే | tAmasa mElanE tALaga jAlanE kOmali nI madi kOrina sommulu chEkonavE vEga rAvE tODi tEvE nA sAmi niTu rammanavE |
చరణం charaNam 3 | అందముగా రతి అందము నేలిన సుందర శ్యామల వేంకట రమణుడు నెనరున కలసిన దాన గాన ఓ మద గజ గమనరో | andamugA rati andamu nElina sundara SyAmala VEnkaTa ramaNuDu nenaruna kalasina dAna gAna O mada gaja gamanarO |