Title | చానరో వాని బాసి | chAnarO vAni bAsi |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 10 | |
పల్లవి pallavi | చానరో వాని బాసి నేనెటువలె సైతునే | chAnarO vAni bAsi nEneTuvale saitunE |
దాని బోధనలు వినుట మానడేమి సేతునే | dAni bOdhanalu vinuTa mAnaDEmi sEtunE | |
చరణం charaNam 1 | సన్నుతాంగి సరసుడని చాల నమ్మి యుంటినే నిన్న దాని యింట జేరి యున్న వగలు వింటినే | sannutAngi sarasuDani chAla nammi yunTinE ninna dAni yinTa jEri yunna vagalu vinTinE |
చరణం charaNam 2 | సదయుడు మదనుని బారికి ముదముతో నను ద్రోసెనే వదలక తన ప్రాయమెల్ల సుదతి పాలు చేసెనే | sadayuDu madanuni bAriki mudamutO nanu drOsenE vadalaka tana prAyamella sudati pAlu chEsenE |
చరణం charaNam 3 | వాసవ నుతుడైన శ్రీనివాసుడు నను గూడెనే బాసలెల్ల మఱచి యా దోసకారి గూడెనే | vAsava nutuDaina SrInivAsuDu nanu gUDenE bAsalella ma~rachi yA dOsakAri gUDenE |