Title | మానినీ వాని | mAninI vAni |
Written By | ||
Book | సంగీత కళానిధి | sangIta kaLAnidhi |
రాగం rAga | జంఝూటి | janjhUTi |
తాళం tALa | రూపక | rUpaka |
Previously Posted At | 21, 181 | |
పల్లవి pallavi | మానినీ వాని జోలి దానను నే గాదే ఓ | mAninI vAni jOli dAnanu nE gAdE O |
కానిదాని మాట విని కరుణ మఱచి యుండెనే | kAnidAni mATa vini karuNa ma~rachi yunDenE | |
చరణం charaNam 1 | కలికిరో నను బాయనని పలికిన దేమాయెనే అల చెలితో కలసి రాక అయిదాఱు నెల లాయెనే | kalikirO nanu bAyanani palikina dEmAyenE ala chelitO kalasi rAka ayidA~ru nela lAyenE |
చరణం charaNam 2 | బోటిరో నను బాయనని బూటకములు చేసెనే మాట తప్పి యున్న వాని మోము జూడ రాదే ఓ | bOTirO nanu bAyanani bUTakamulu chEsenE mATa tappi yunna vAni mOmu jUDa rAdE O |
చరణం charaNam 3 | సన్నుతాంగి చాల వలచి యిన్ని దినము లుంటినే నన్ను గూడి వేంకటేశుడన్న మాట వింటినే | sannutAngi chAla valachi yinni dinamu lunTinE nannu gUDi vEnkaTESuDanna mATa vinTinE |