Title | బాలామణి బిగి కవుగిలి | bAlAmaNi bigi kavugili |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | బిళహరి | biLahari |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | బాలామణి బిగి కవుగిలి విడజాలి జాలిమాలి కనుగొనవేరా వినవౌరా! యనువౌరా! కినుక యిటు చనునటర | bAlAmaNi bigi kavugili viDajAli jAlimAli kanugonavErA vinavaurA! yanuvaurA! kinuka yiTu chanunaTara |
చరణం charaNam 1 | నతి యనెరా గతి యనెరా సతి కుటిల గతి నీకు వ్రతమా? మది కఱుగదుర? | nati yanerA gati yanerA sati kuTila gati nIku vratamA? madi ka~rugadura? |
చరణం charaNam 2 | బెదరు వారి పొదల దూరి పరుగిడు సుదతి జేరి మదనుడ దయుడై మదము మీఱి యెదను దూరి తెఱలెడు ప్రదరమేఱి పదను నూరి గురి యిడె | bedaru vAri podala dUri parugiDu sudati jEri madanuDadayuDai madamu mI~ri yedanu dUri te~raleDu pradaramE~ri padanu nUri guri yiDe |
చరణం charaNam 3 | మంగళ మిక నంగనంగన భుజంగ శయ భుజంగ పుంగవ శుభంకర యళులకు రంగట చిలుకల చెంగట కొలకుల ముంగిట దానలంగి నలంగి తలంగి తొలంగి మలంగి మెలంగి కలంగెనురా మరులు కొనెరా మరతజనురా? పరాకురా బిరాన రారా | mangaLa mika namganamgana bhujanga Saya bhujanga pungava Subhamkara yaLulaku rangaTa chilukala chengaTa kolakula mungiTa dAnalangi nalangi talangi tolangi malangi melangi kalangenurA marulu konerA maratajanurA? parAkurA birAna rArA |
swaram available with sAhityam for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.