Title | సారసలోచన | sArasalOchana |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | హిందుస్థాని కాఫీ | hindusthAni kAfI |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | సారసలోచన వేచెరా వేమారు నీ రాకకు | sArasalOchana vEcherA vEmAru nI rAkaku |
1 | కోరి వలచినదిరా మారు సతికి బ్రతిరా చేరి కవుగలిడరా యేరిని మది గోరదు చెలి | kOri valachinadirA mAru satiki bratirA chEri kavugaliDarA yErini madi gOradu cheli |
2 | రాజ వదన యెదను వలరా జుముదము కదుర శర రాజి బఱుప బెదరి నిజ రాజ వని నిను శరణనెరా జగతి రా జగతి రా జనవర మనపవుర | rAja vadana yedanu valarA jumudamu kadura Sara rAji ba~rupa bedari nija rAja vani ninu SaraNanerA jagati rA jagati rA janavara manapavura |
3 | ఆ మగువ నగవు మొగమలకలు వల చెలి గెలిచెడు నా చెలి సొగసుగ నులు తొగల మిగులు మరాళ గమన సుమా యరాళ చికుర సుమా వరాల తరువు సుమా కడాని మిసి మిడాల్ దెలుపు బలుపు జిగి బిగి గొను చనులు పసిడి కడవల దెగడెడుర కలికిరా చిలుకరా నత భుజంగ పతి వినుత | A maguva nagavu mogamalakalu vala cheli gelicheDu nA cheli sogasuga nulu togala migulu marALa gamana sumA yarALa chikura sumA varAla taruvu sumA kaDAni misi miDAl delupu balupu jigi bigi gonu chanulu pasiDi kaDavala degaDeDura kalikirA chilukarA nata bhujanga pati vinuta |
swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.