Title | సామి చెలి నిను | sAmi cheli ninu |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సామి చెలి నిను వలచి పిలిచెరా సమయ మిదియ సకి గలయ ఆ మెలత కలత కల నిను గని కలియగ జని యులికి పడు | sAmi cheli ninu valachi pilicherA samaya midiya saki galaya A melata kalata kala ninu gani kaliyaga jani yuliki paDu |
చరణం charaNam 1 | ఆ పడతుక యొడలి యొడుపు నడక వడువు దొడల బెడగు గన జడ వడుగులు నెడదలు కడు సడల సుడివడు దురుర | A paDatuka yoDali yoDupu naDaka vaDuvu doDala beDagu gana jaDa vaDugulu neDadalu kaDu saDala suDivaDu durura |
చరణం charaNam 2 | నిక్కు చనుల పయి నొక్కులు పఱచుచు చెక్కిలి పలు మఱు నొక్కుచు వలపుల హాళి జాలి కేళి దేలి కిల కిల నగవుల గొలుపుచు సొగియర | nikku chanula payi nokkulu pa~rachuchu chekkili palu ma~ru nokkuchu valapula hALi jAli kELi dEli kila kila nagavula golupuchu sogiyara |
చరణం charaNam 3 | అంగజుడు గనయ ముంగొనయ ముంగొలి పెర భుజంగ నర పుంగవ వరద తాళ గలదుర వేళ గడపక లీల నేలర | angajuDu ganaya mumgonaya mumgoli pera bhujanga nara pungava varada tALa galadura vELa gaDapaka lIla nElara |
swaram is also available for this jAvaLi. ఈ జావళికి సాహిత్యముతో పాటు స్వరము కూడా ఉన్నది.