#522 బంగారు తండ్రి bangAru tanDri

Titleబంగారు తండ్రిbangAru tanDri
Written Byమంత్రిప్రగడ భుజంగ రావుmantripragaDa bhujanga rAvu
BookగానామృతముgAnAmRtamu
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఅటaTa
పల్లవి pallaviబంగారు తండ్రి యటే యశోదా నీ పట్టి కొంటె కాడటేbangAru tanDri yaTE yaSOdA nI paTTi konTe kADaTE
చరణం
charaNam 1
అంగనరో యెంత నంగనాచివె నీవు
ముంగిటనే నాడు బంగరు కెంపుల
బొంగరములు కన్మొఱంగ జేసి పైట
కొంగున రవికె మఱుంగన డాచితె
దొంగ తనము నెఱింగి నాడ న-
నంగునకు దెలుపంగల నవి యొ-
సంగు మని యుప్పొంగు చనులటె
చెంగునం గొని భంగ పఱచెను
anganarO yenta nanganAchive nIvu
mungiTanE nADu bangaru kempula
bongaramulu kanmo~ranga jEsi paiTa
konguna ravike ma~rungana DAchite
donga tanamu ne~ringi nADa na-
nangunaku delupangala navi yo-
sangu mani yuppongu chanulaTe
chengunam goni bhanga pa~rachenu
చరణం
charaNam 2
ఎట్టి వాడొ నీదు పట్టి చూడవమ్మ
యెట్టు సైతుమమ్మా
పట్ట పగలందఱి యెట్ట యెదుట నొక్క
చిట్టి పూల బంతి కట్టి నాపై వైచి
కుట్టె గుట్టెనదె గట్టి తేలు నీదు
కట్టు చీరె దూరె నెట్టు లొక్కొ యని
యట్టె పైబడి పుట్ట మూడిచి
బిట్టు కౌగిట జుట్టి కుచముల
బట్టి బయలున నిట్ట నిలువుగ
బెట్టి నవ్వుచు దట్టె చేతుల
eTTi vADo nIdu paTTi chUDavamma
yeTTu saitumammA
paTTa pagalanda~ri yeTTa yeduTa nokka
chiTTi pUla banti kaTTi nApai vaichi
kuTTe guTTenade gaTTi tElu nIdu
kaTTu chIre dUre neTTu lokko yani
yaTTe paibaDi puTTa mUDichi
biTTu kaugiTa juTTi kuchamula
baTTi bayaluna niTTa niluvuga
beTTi navvuchu daTTe chEtula
చరణం
charaNam 3
బిత్తరి నీవెంత యెత్తొ కాంతునని
హత్తి కౌగిట నొత్తెనే
అత్తఱి చూచి మా యత్త గారు కోప-
మెత్తి యౌర! యోరి! మత్త దంతు నన్న
బెత్తనంబు నీకు సత్తువ లేదు నీ
చిత్తము రీతి కేలెత్తి సల్పువాడ-
గుత్తకొని నీ మత్త కాశిని
క్రొత్త గుబ్బల మత్తడంచెద
తత్తధిమి తధి తత్త యని న-
న్నెత్తి కొని పఱుగెత్తి యాడెనె
bittari nIventa yetto kAntunani
hatti kaugiTa nottenE
atta~ri chUchi mA yatta gAru kOpa-
metti yaura! yOri! matta dantu nanna
bettanambu nIku sattuva lEdu nI
chittamu rIti kEletti salpuvADa-
guttakoni nI matta kASini
krotta gubbala mattaDamcheda
tattadhimi tadhi tatta yani na-
nnetti koni pa~rugetti yADene
చరణం
charaNam 4
దండను నా నాధుడుండగా వాతెఱ-
గండి వడ నొక్కెనే
దుండగీడు వాడె వండురా? యన జను-
గొండల నడుమ నుండి నూగారను
నుండు నెపమున రానుండు రాహువు చేర-
కుండగ ముఖ శశి మండలమున నధర-
కుండమున గడు నిండిన సుధకు
గండి చేసితి వండ బాపితి
గొండెమా? యిది రండు భుజగ వి-
భుండు తీరుచు గొండు తగవనె
danDanu nA nAdhuDunDagA vAte~ra-
ganDi vaDa nokkenE
dunDagIDu vADe vanDurA? yana janu-
gonDala naDuma nunDi nUgAranu
nunDu nepamuna rAnunDu rAhuvu chEra-
kunDaga mukha SaSi manDalamuna nadhara-
kunDamuna gaDu ninDina sudhaku
ganDi chEsiti vanDa bApiti
gonDemA? yidi ranDu bhujaga vi-
bhunDu tIruchu gonDu tagavane

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s