Title | రారా మా చెలి | rArA mA cheli |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | కన్నడ | kannaDa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రారా మా చెలినేలరా లేచి రారా మా చెలి మేరా నీకిది మంచిదేరా వేకువ యయ్యె లేరా లోకులు నవ్వి పోరా రారా చెలినేలరా | rArA mA chelinElarA lEchi rArA mA cheli mErA nIkidi manchidErA vEkuva yayye lErA lOkulu navvi pOrA rArA chelinElarA |
చరణం charaNam 1 | మల్లి విరుల జాల వెల్లి విరియగ బాన్పు జల్లి కురుల జడలల్లి సిరుల విలసిల్లి త్రుళ్ళినదిర | malli virula jAla velli viriyaga bAn&pu jalli kurula jaDalalli sirula vilasilli truLLinadira |
చరణం charaNam 2 | సొక్కి మారుని ఢాక జిక్కి యారని కాక స్రుక్కి తీరని మోహమెక్కి నేరము సైప మ్రొక్కి దక్కితి ననె | sokki mAruni DhAka jikki yArani kAka srukki tIrani mOhamekki nEramu saipa mrokki dakkiti nane |
చరణం charaNam 3 | మేని మెఱుగుల జాల బైని మెఱయగ జేయు దాని మెఱపుల మోసపోని తెఱగును గానవేని హాని యౌననె | mEni me~rugula jAla baini me~rayaga jEyu dAni me~rapula mOsapOni te~ragunu gAnavEni hAni yaunane |
చరణం charaNam 4 | మేల? చనవు తడవేల? కినుక కిది వేళ? విను భుజగ పాల! ఘనుల కిది వాల? పోలదుర | mEla? chanavu taDavEla? kinuka kidi vELa? vinu bhujaga pAla! ghanula kidi vAla? pOladura |