Title | తాళజాలరా | tALajAlarA |
Written By | మంత్రిప్రగడ భుజంగరావు | mantripragaDa bhujangarAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | హిందుస్థానీ కమాచి | hindusthAnI kamAchi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | తాళజాలరా యిక నే దాళజాలరా జాలమేల వెన్నెలల రాజు వలరాజు జేరెనిక | tALajAlarA yika nE dALajAlarA jAlamEla vennelala rAju valarAju jErenika |
చరణం charaNam 1 | చనుమానముచే మనవి చేసినను మనమున నెన్నవు మంచివాడవౌ | chanumAnamuchE manavi chEsinanu manamuna nennavu manchivADavau |
చరణం charaNam 2 | సరసుడంచు నిను సరసకు బిలిచితి గరుణ జేసి తాప భరము తీర్పరా | sarasuDanchu ninu sarasaku bilichiti garuNa jEsi tApa bharamu tIrparA |
చరణం charaNam 3 | మదనుడు శరముల పదనురా నూరెడు నదనిదే కౌగిట గదియింప గనను | madanuDu Saramula padanurA nUreDu nadanidE kaugiTa gadiyimpa gananu |
చరణం charaNam 4 | రాజనుత భుజంగ రాయ కవిదేవ భూజమా! నీ కీర్తి రాజిల్లు నిక భూమి | rAjanuta bhujanga rAya kavidEva bhUjamA! nI kIrti rAjillu nika bhUmi |