Title | లీల మరువలేనే | lIla maruvalEnE |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | లీల మఱువలేనే వాని లీల మఱువలేనే | lIla ma~ruvalEnE vAni lIla ma~ruvalEnE |
చరణం charaNam 1 | ఏలాగు తాళుదు బాలామణిరో నేడు చాల రతుల చేత సౌఖ్యము గూర్చిన | ElAgu tALudu bAlAmaNirO nEDu chAla ratula chEta saukhyamu gUrchina |
చరణం charaNam 2 | నిన్నటి రేయి నా కన్నులు మూసి తా దిన్నగా నిలుమని చన్నుల జేబట్టు | ninnaTi rEyi nA kannulu mUsi tA dinnagA nilumani channula jEbaTTu |
చరణం charaNam 3 | దూరమున నిల్వ మారు కేళికిటు చేరు మనుచు నా జారు పైట లాగు | dUramuna nilva mAru kELikiTu chEru manuchu nA jAru paiTa lAgu |
చరణం charaNam 4 | తనయుల వలె దన దాసుల జూచుచు దనర భుజంగ రావు దాసు నేలువాని | tanayula vale dana dAsula jUchuchu danara bhujanga rAvu dAsu nEluvAni |