Title | ఓ విరిబోడిరో | O viribODirO |
Written By | మంత్రిప్రగడ భుజంగ రావు | mantripragaDa bhujanga rAvu |
Book | గానామృతము | gAnAmRtamu |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఓ విరిబోడిరో యోర్వగ జాలనె కావవె నన్ను గూడి ఘన రతుల దేల్చి | O viribODirO yOrvaga jAlane kAvave nannu gUDi ghana ratula dElchi |
చరణం charaNam 1 | చెమ్మగిల్లు నీకు చమ్ముల నాయెద గ్రుమ్ముచు గౌగిలి యిమ్మని వేడెద | chemmagillu nIku chammula nAyeda grummuchu gaugili yimmani vEDeda |
చరణం charaNam 2 | కళలూరగ నిక గాము కేళిని నా కలవర ముడుపవే కాంతరో! మ్రొక్కెద | kaLalUraga nika gAmu kELini nA kalavara muDupavE kAntarO! mrokkeda |
చరణం charaNam 3 | లలనా మణిరో వలసిన రతుల గలలో నిను గూడి సొలయు చుంటినే | lalanA maNirO valasina ratula galalO ninu gUDi solayu chunTinE |
చరణం charaNam 4 | రాజ బహదరు విరాజి భుజంగ్రావు పూజల గైకొను భూజన ప్రియుడనే | rAja bahadaru virAji bhujangrAvu pUjala gaikonu bhUjana priyuDanE |